చంద్రబాబు, లోకేశ్‌లపై కేసు నమోదు | Case filed against Chandrababu and Lokesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేశ్‌లపై కేసు నమోదు

Published Mon, Jun 1 2020 5:05 AM | Last Updated on Mon, Jun 1 2020 5:05 AM

Case filed against Chandrababu and Lokesh - Sakshi

నందిగామ/కంచికచర్ల: లాక్‌డౌన్‌ నిబంధనలను చంద్రబాబు, లోకేశ్‌లు ఉల్లంఘించారంటూ ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌హెచ్‌వో కనకారావు తెలిపిన వివరాల మేరకు.. చంద్రబాబు, లోకేశ్‌లు మే 25న హైదరాబాద్‌ నుంచి రహదారి మార్గాన విజయవాడ వైపు వెళ్లారు. ఆ సమయంలో వారు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బర్రె శ్రీనివాసరావు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement