వైఎస్‌ఆర్ జిల్లా ,రాజంపేట : వారిద్దరు వేర్వేరు జిల్లాలకు చెందినవారు. జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. అక్కడ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కా స్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగిన వారి దాంపత్యంలో ఎందుకో కలతలు మొదలయ్యాయి. అవి కాస్తా ముదిరి ఇద్దరూ కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించారు. వివరాల్లోకి వెళితే.. రాజంపేట మండలం బోయనపల్లె దళితవా డకు చెందిన కత్తి సుబ్బన్న దంపతులు బేల్దారి పని చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండో కుమార్తె వాణి (27) జీవనోపాధి నిమిత్తం ఏడాదిన్న ర క్రితం గల్ఫ్ దేశమైన కువైట్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు కర్నూలు జిల్లా బనగానపల్లెకు చెందిన సుబ్రమణ్యం (31)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి అక్కడే వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంతానం లేదు.
మూడు నెలల క్రితం స్వదేశానికి..
తమ వారిని చూసేందుకు మూడు నెలల క్రితం వీ రిద్దరు కువైట్ నుంచి నేరుగా బోయనపల్లెకు చేరుకున్నారు. అక్కడ వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఈ మధ్యలో కుటుంబంలో భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలు తలెత్తినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరు ఇంటి నుంచి వెళ్లి తనువు చాలించాలని అనుకున్నారో ఏమో బుధవారం కడప నగర శివారులోని కనుమలోపల్లె రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఉదయం ఇంట్లో నుంచి వెళ్లారు..
కనుమలోపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతుల సంఘటనపై వాణి తండ్రి కత్తి సుబ్బన్నకు సమాచారం అందింది. అయితే ఆయన ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలిపేందుకు ఇష్టపడలేదు. ఉదయం ఇంటి నుంచి వెళ్లారనే విషయాన్ని మాత్రం చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment