కోదాడలో ర్యాలీ నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులు బాదె రాము (ఫైల్)
మునగాల(కోదాడ) : రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన 65వ నంబర్ జాతీయరహదారిపై మండలంలోని ముకుందా పురం శివారులో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన బాదె రాము(45) తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి కోదాడ వైపునకు వెళుతున్నాడు. మార్గమధ్యలో ముకుం దాపురం వద్ద సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళుతున్న పాల ట్యాంకర్ అతివేగంగా వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాదె రాము మీదుగా లారీ చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెం దాడు. రాము ప్రస్తుతం కోదాడ నియాజకవర్గ పార్టీ డివిజన్ కార్యదర్శిగా, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా రాముకు భార్య ఇద్దరు కుమా ర్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కోదాడలో అంతిమ వీడ్కోలు
కోదాడఅర్బన్ : సీపీఐఎంఎల్(న్యూ డెమోక్రసీ)కోదాడ డివిజన్ నాయకుడు, అఖిల భారత రైతు కూలీ సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బాదె రాము మృత దేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు, పార్టీ శ్రేణులకు అప్పగించారు. బాదే రాము మృతదేహాన్ని పట్టణంలో ఎర్రజెండాలతో పార్టీ శ్రేణులు, సీపీఐ, సీపీఎం, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి çసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పార్టీ కార్యాలయం అయిన లాల్ బంగ్లాకు తీసుకొచ్చి అక్కడ కొద్ది సేపు ఉంచారు. అక్కడ పార్టీ నాయకులు ఆయన మృతదేహంపై ఎర్రజెండా కప్పి పూల దండలు వేసి నివాళులర్పించారు.
అనతంతరం ఆయన మృతదేహాన్ని ఆయన స్వగ్రామం రామచంద్రాపురానికి తరలించారు. కాగా మృదుస్వభావిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న రాము మృతి పార్టీకి, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని ఎఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు అన్నారు. ఆస్పత్రిలో ఆయన మృతదేహాన్ని సందర్శించిన అనంతరం పార్టీ కార్యాలయంలో నివాళులర్పించి మాట్లాడారు. రాము మృతికి నివాళులర్పించి వారిలో రైతు కూలి జిల్లా నాయకులు వక్కవంతుల ప్రభాకర్‌రావు, లక్ష్యయ్య, శ్రీను, చందర్‌రావు, ఉపేందర్, జన సమితి జిల్లా నాయకులు ధర్మార్జున్, రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి, దేవిడ్ కుమార్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, పోటు లక్ష్మయ్య, రాయికృష్ణ, కిరణ్, వక్కవంతుల నాగార్జున, మట్టారెడ్డి, కీసర మురళి, సీపీఐ నాయకులు మేకల శ్రీనివాసరావు, లతీప్, సీపీఎం నాయకులు కుక్రడపు ప్రసాద్, ముత్యాలు, ఘంటానాగయ్య, రవి, ఉదయగిరి ఉన్నారు.
పలు పార్టీల నాయకుల సంతాపం
బాదే రాము మృతి పట్ల కోదాడకు చెందిన పలు పార్టీ నాయకులు, ప్రజాప్రతనిధులు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రా వు, ఎన్‌పద్మావతిరెడ్డి, కాంగ్రెస్ టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, స్యచ్ఛంద సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment