
వీడియో దృశ్యం
ముంబై : హోటల్ లోపల తినడానికి అనుమతి ఇవ్వలేదన్న కోపంతో కొంతమంది వ్యక్తులు హోటల్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బారామతిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, షిరోలీ గ్రామంలోని విజయ రెస్టారెంట్‌కు ఈ నెల 15న కొంతమంది కస్టమర్లు వచ్చారు. వారందరూ భోజనం ఆర్డర్ చేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా హోటల్ లోపల తినడానికి దాని యజమాని వారిని అనుమతించలేదు. పార్శిల్ తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో వారు అతడిపై మండిపడ్డారు. తమను లోపల తినడానికి అనుమతివ్వాలంటూ గొడవ పెట్టుకున్నారు. అనంతరం కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు. ( నా చావుకు ఎవరూ బాధ్యులు కారు)
దాడి దృశ్యం
కొద్దిసేపటి తర్వాత మరి కొంతమంది మిత్రులతో కలిసి అక్కడి వచ్చారు. హోటల్‌లోకి దూసుకుపోయి నానాబీభత్సం సృష్టించారు. హోటల్ సిబ్బందిని చితకబాది, సామాన్లను ధ్వంసం చేసి అక్కడినుంచి పరారయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment