
హర్షిత( ఫైల్)
కథలాపూర్(వేములవాడ): డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని ఓ యువకుడు వెంటపడి వేధింపులకు పాల్పడడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కథలాపూర్ మండలం దుంపేటలో గురువారం జరిగింది. పోలీసులు, కటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన తోట హర్షిత(22) కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతుంది.
కొంత కాలంగా కథలాపూర్‌కు చెందిన దినేశ్ అనే యువకుడు ప్రేమ పేరిట హర్షితను వేధిస్తున్నాడు. విషయాన్ని హర్షిత కుటుంబ సభ్యులకు తెలుపడంతో సదరు యువకుడిని పద్ధతి మార్చుకోవాలని సూచిం చారు. అయినా ప్రేమించాలని హర్షితను దినేశ్ వెంబడిస్తూ వేధింపులకు పాల్పడుతుండడంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న హర్షితను కోరుట్ల ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగేశ్వర్‌రావు పరిశీలించారు. మృతురాలి తండ్రి నరేశ్ ఉపాధినిమిత్తం దుబాయిలో ఉంటున్నారు. మృతురాలి తల్లి తోట భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment