న్యూఢిల్లీ : ఉదయాన్నే వ్యాయామం కోసం సైకిల్‌పై వచ్చిన యువకుడి నుంచి ఖరీదైన సైకిల్‌తో పాటు ఐఫోన్‌ను దుండగులు గుంజుకున్న ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ద్వారకా సెక్టార్ 19కు చెందిన నిషాంత్ సింగ్ శుక్రవారం తెల్లవారుజామున సైకిల్‌పై వస్తుండగా కన్నాట్‌ప్లేస్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడి వద్ద నుంచి సైకిల్, ఐఫోన్‌ను తీసుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు బైక్‌పై, మరొకరు తన సైకిల్‌పై పారిపోయారని నిందితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సైకిల్ బాస్కెట్‌లో ఐఫోన్-ఎక్స్‌ఎస్ మ్యాక్స్ ఉందని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment