
బస్సు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహిస్తున్న దృశ్యం
పశ్చిమగోదావరి, అత్తిలి: మద్యం సేవించి కళాశాల బస్సు నడుపుతున్న బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తణుకు మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
శుక్రవారం రాత్రి పాలూరు డ్యాం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏపీ 31 టీడబ్ల్యూ 1119 బస్సుడ్రైవర్ మద్యం సేవించి ఉండటాన్ని గుర్తించారు.
బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 140 ఎంజీ పర్ 100 ఎంఎల్ ఉందని ఎంవీఐ శ్రీనివాసరావు తెలిపారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, బస్సును సీజ్ చేశామన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులను అదే కళాశాలకు చెందిన వేరే బస్సులో పంపించారు. ఈసందర్భంగా ఎంవీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో బస్సు డ్రైవర్‌పై అనుమానం వచ్చి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష జరిపితే మద్యం సేవించి ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. కళాశాల యాజమాన్యాలు కూడా తమ కళాశాల బస్సు డ్రైవర్‌ల పరిస్థితిపై దృష్టిసారించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment