
గాయాల పాలైన మాలోతు తావు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని రేగొండ పరిధిలోని నర్సింహతండాకు చెందిన మాలోతు తావు శుక్రవారం కరెంట్ షాక్‌కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల ప్రకారం..తండాకు చెందిన మాలోతు తావు తన వ్యవసాయ బావి వద్ద కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి కర్రతో తీగలను కదిలించాడు. ఆ సమయంలో కరెంట్ షాక్‌కు గురవడంతో తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.