
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక మండలంలోని లచ్చపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రి తన ఇద్దరు కూతుళ్లను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. లచ్చపేట గ్రామానికి చెందిన బడుగు రాజు (40) తన ఇద్దరు కూతుళ్లు భవాని (9), లక్ష్మీ (5)లకు ఉరివేసి.. ఆపై అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల వల్లే ఈ ఘటనకు పాల్పడ్డారని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment