
నేరేడ్‌మెట్: మెన్స్‌పార్లర్‌లో జరిగిన గొడవ దాడికి దారి తీసిన సంఘటన శుక్రవారం నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింహ్మస్వామి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి...ఠాణా పరిధిలోని రేణుకానగర్‌కు చెందిన ఉషాకిరణ్ శ్రీకాలనీలో బద్రీ మెన్స్‌పార్లర్ నిర్వహిస్తున్నాడు. గురువారం ప్రకాష్ వ్యక్తి అతడి వద్దకు హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు వచ్చాడు. కొద్దిసేపు ఆగాలని పార్లర్‌లో పని చేసే మంజూరు అతడికి చెప్పడంతో ఆగ్రహానికిలోనైన ప్రకాష్ స్క్రూడ్రైవర్‌తో అతడిపై దాడి చేశాడు. పార్లర్ యజమాని ఉషాకిరణ్ దీనికి అడ్డుకునే యత్నం చేయగా అతనికీ గాయాలయ్యాయి. పార్లర్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment