సాక్షి, ఖమ్మం: జిల్లాలోని లంకపల్లిలో ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో తేజస్విని అనే 19 ఏళ్ల అమ్మాయిని.. నితిన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. తేజస్వినిది పెనుబల్లి మండలం కూపెనకుంట్ల గ్రామం. తేజస్విని, నితిన్ ఇద్దరూ పెనుబల్లి ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లామా చదువుతూ ప్రేమలో పడ్డారని సమాచారం. విషయం తెలిసి తల్లిదండ్రులు కూడా మందలించినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల తేజస్విని మరో అబ్బాయితో చనువుగా ఉంటుందని అనుమానించిన నితిన్... ఆమెను కొత్తలంకపల్లి దగ్గరకు తీసుకెళ్లి గొడవ పడినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆమెను అక్కడే చంపేసి... ఏమీ తెలియనట్టు హాస్టల్‌కి వెళ్లిపోయాడని పోలీసులు చెప్తున్నారు. కేసు విచారణలో విషయం బయటపడడంతో నిందితుడు నితిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment