సాక్షి, నేలకొండపల్లి : ఏడాది క్రితం జిల్లాలో సంచలనం కలిగించిన షేక్ షేన్‌బీ హత్యకేసును పోలీసులు చేధించారు. ఇందుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
వివరాలు.. నేలకొండపల్లి మండలం మండరాజుపల్లి గ్రామానికి చెందిన షేక్ షేన్‌బీని సూర్యాపేట జిల్లాలోని త్రిపురావంకు చెందిన హస్సాన్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఇరువురు కొంతకాలంగా బాగానే ఉన్నారు. వారికి బాబు(7)నెలల బాలుడు ఉన్నాడు. అయితే హస్సాన్ బాబుకు ఆయన భార్యపై అనుమానం మొదలైంది.
పుట్టిన వాడు తన కొడుకు కాదని భావించి, అనుమానం పెంచుకుని 2016 నవంబర్ 23న బాబు గొంతు నులిమి హత్య చేశారు. అప్పటి నుంచి పరారీ లో ఉన్నారు. ఆయనకు సహకరించి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment