ప్రియుడి ఇంటిఎదుట యువతి బైఠాయింపు | Girl Protest In Front Of Boyfriend House In Nirmal | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటిఎదుట యువతి బైఠాయింపు

Jul 9 2018 12:03 PM | Updated on Aug 17 2018 2:56 PM

Girl Protest In Front Of Boyfriend House In Nirmal - Sakshi

యువతితో మాట్లాడుతున్న మహిళా సంఘాల సభ్యులు

సారంగపూర్‌(నిర్మల్‌): మూడేళ్లుగా తనను ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర ఆందోళన చెందిన యువతి ప్రియుడి ఇంటిఎదుట బైఠాయించిన ఘటన ఆదివారం మండలంలోని బీరవెల్లిలో చోటు చేసుకుంది. బీరవెల్లి గ్రామానికి చెందిన మద్ది నర్సయ్య–లక్ష్మి దంపతుల కుమార్తె శ్యామల(21) అదే గ్రామానికి చెందిన కొక్కుల రాజేశ్వర్‌–లక్ష్మి దంపతుల కుమారుడు దినేష్‌(25) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దినేష్‌ ఉన్నత చదువుల నిమిత్తం బయటకు వెళ్లడంతో ప్రతీరోజు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఇరువురు ఒకే కులానికి చెందినవారు కావడంతో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు.

ఇదే క్రమంలో రోజు తనతో ఫోన్‌లో సంభాషించే దినేష్‌ నెలరోజులుగా మాట్లాడకపోవడంతో నిరాశ చెందిన శ్యామల ఇంట్లోఉన్న సూపర్‌వాస్మోల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో విషయం ఇంట్లోవాళ్లకు తెలిసి సదరు యువతిని విచారించగా ప్రేమ వ్యవహారం తెలిసింది. దినేష్‌తో తన పెళ్లి జరిపిస్తామని యువతిని ఒప్పించిన ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి న అనంతరం యువతి దినేష్‌ ఇంటిఎదుట బై ఠాయించింది. ఐద్వా మహిళా సంఘం ప్రతిని« దులు సునీత, తదితరులు యువతికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో రెండుకుటుంబాలకు చెందిన పెద్దలను పిలిపించి సర్పంచ్‌ ఎల్లన్న, ఎస్సై సునీల్‌కుమార్‌ ప్రేమజంటను ఏకంచేసే ప్రయత్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement