కర్లపాలెం: మండల పరిధిలో రెండు గ్రామాల్లో జరిగిన దొంగతనాల్లో 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. ఒకే రోజు జరిగిన రెండు దొంగతనాలతో మండల ప్రజలు భయపడిపోతున్నారు. నల్లమోతువారిపాలెం లో ఓ ఇంటి తలుపులు పగులగొట్టి దొంగలకు లోపలకు ప్రవేశించారు. బీరువా తెరచి 15 సవర్ల బంగారం రూ.2లక్షల నగదు దోచుకువెళ్లారు. నల్లమోతువారిపాలెం గ్రామానికి చెందిన మాడా శేషగిరిరావు, వాణి దంపతులు ఇంటికి తాళాలు వేసి పని మనిషిని కాపలాపెట్టి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కుమారుడు కిరణ్ వద్దకు నెల రోజుల కిందట వెళ్లారు.పని మనిషి గందెళ్ల పోలేశ్వరి రోజూ ఇంటి ఆవరణలో మొక్కలకు నీరు పెడుతూ రాత్రికి వరండాలో నిద్రిస్తూ ఉంటుంది.
ఆదివారం ఆమె అప్పికట్ల లో భజన ఉండటంతో కొడుకు గోపీని ఇంటికి కాపలా ఉంచి వెళ్లింది. అతడికి వాంతులు, విరేచనాలు కావడంతో తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వెళ్లాడు. ఉదయం 7 గంటల సమయంలో తిరిగి ఇంటికి రాగా వెనుక వైపు తలుపులు తెరిచి ఉండటంతో బాపట్లలో ఉన్న శేషగిరిరావు బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా, బీరువా తలుపు పగలగొట్టి అందులో ఉన్న దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడవేసి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి కర్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఉన్న శేషగిరిరావుకు విషయం తెలుపగా, బీరువా లాకరులో 15 సవర్ల బంగారం, 2 లక్షల నగదు ఉండాలని తెలిపినట్లు బంధువులు వివరించారు. ఈ మేరకు కర్లపాలెం ఎస్‌ఐ వి.శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్‌ను పిలిపించి వేలిముద్రలు సేకరించనున్నామని తెలిపారు.
చింతాయపాలెం గ్రామానికి చెందిన ఈవూరి పద్మావతి కర్లపాలెం సెంటర్‌లోని ఓ నగల దుకాణంలో ఒక బంగారు చైను, 5 సవర్ల బంగారు తాడు కొనుగోలు చేసి చిన్న పర్స్‌లో పెట్టుకుని మరొక ప్లాస్టిక్ సంచిలో వేసుకుంది. ఆ తరువాత సెంటర్‌లోని మరో దుకాణంలో ప్లాస్టిక్ వస్తువులు కొనుగోలు చేసింది. మరొక షాపులో దుస్తులు కొనుగోలు చేసి చింతాయపాలెంలో ఇంటికి Ðవెళ్లి చూసుకోగా నగలు ఉన్న పర్స్ మాయమవటంతో ఆందోళన చెంది కర్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment