చెన్నైకి నాథూరాం | gold showroom robbery case nathuram in chennai jail | Sakshi
Sakshi News home page

చెన్నైకి నాథూరాం

Published Sat, Jan 27 2018 7:36 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

gold showroom robbery case nathuram in chennai jail - Sakshi

నాథూరాం

సాక్షి, చెన్నై: ఇన్‌స్పెక్టర్‌ పెరియపాండి మరణానికి కారుకుడు, కొళత్తూరు బంగారు షోరూం దోపిడీలో ప్రధాన నిందితుడు నాథూరాం, అతడి అనుచరులు ఇద్దర్ని రాజస్తాన్‌ నుంచి చెన్నైకు తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి పుళల్‌ జైలుకు తరలించారు. చెన్నై కొళత్తూరులోని ఓ జ్యువెలరీ దోపిడీ కేసు ఛేదింపునకు మధురవాయిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పెరియ పాండి, కొళత్తూరు ఇన్‌స్పెక్టర్‌ ముని శేఖర్‌ల నేతృత్వంలో ఆరుగురు పోలీసుల బృందం రాజస్తాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తమిళ పోలీసుల బృందం మీద ఆ దోపిడీదొంగలు  కాల్పులు జరపడం, ఇందులో మధురవాయిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పెరియపాండి మరణించడం చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర పోలీసుల్ని ఉలిక్కి పడేలా చేసింది. విషయం తెలిసిందే.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాథూరాంను కాల్చి చంపేందుకు తగ్గట్టుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయి తే,  దుండుగుల కాల్పుల్లో పెరియపాండి మరణించలే ద ని, నాథూరాంను పట్టుకునే క్రమంలో గురి తప్పినట్టు తే లింది. చివరకు నాథూరాంను పట్టుకునేందుకు వెళ్లిన బృం దం వెనక్కు రాక తప్పలేదు. చివరకు రాజస్తాన్‌ పోలీసులు రంగంలోకి దిగి నాథూరాం, అతడి అనుచరులు ఇద్దరిని పట్టుకున్నారు. ఈ సమాచారం చెన్నైకు చేరడంతో ఉత్తర చెన్నై అదనపు కమిషనర్‌ జయరాం నేతృత్వంలో పది మం ది పోలీసుల బృందం రాజస్తాన్‌కు గతంలో వెళ్లారు. అక్కడ కోర్టును ఆశ్రయించి, ఆ తదుపరి చెన్నైకు తరలించారు. గురువారం రాత్రి చెన్నైకు నాథూరాంతో పాటు అతడి అనుచరులు దినేష్‌ చౌదరి, మాత్తూరులను తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అనంతరం పుళల్‌ జైలుకు తరలించారు. సోమవారం ఈ ముగ్గుర్ని తమ కస్టడికి తీసుకుని విచారించేందుకు తగ్గ చర్యలు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement