ప్రాణం తీసిన మడి కట్టుబాట్లు | Husband Killed Wife And Commits Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మడి కట్టుబాట్లు

Published Thu, Feb 20 2020 8:16 AM | Last Updated on Thu, Feb 20 2020 8:16 AM

Husband Killed Wife And Commits Suicide in Karnataka - Sakshi

శాంతమూర్తి, పుట్టమణి (ఫైల్‌)

కర్ణాటక, మైసూరు: నిరంతరం మడి పాటిస్తూ దూరం పెడుతుండడాన్ని సహించలేక భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మైసూరుజిల్లా నంజనగూడు తాలూకాలో చోటు చేసుకుంది. మండహళ్లి గ్రామానికి చెందిన రైతు శాంతమూర్తికి 15 ఏళ్ల క్రితం పుట్టమణి అనే మహిళతో వివాహం జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా కొద్ది కాలంగా పుట్టమణి మడి కట్టుబాట్లు పాటిస్తోంది.  రోజూ పదిసార్లకు పైగా  స్నానం చేయడంతో పాటు భర్త,పిల్లలకు సైతం చల్లనీళ్లతో స్నానాలు చేయించేది. మడి కట్టుబాట్లు  తగ్గించుకోవాలని సూచించగా ఆమె పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పుట్టమణి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని విసుగు చెందిన శాంతమూర్తి..బుధవారం   పుట్టమణిని కత్తితో హత్య చేసి   మృతదేహాన్ని దూలానికి ఉరేశాడు. తరువాత తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement