పిల్లలు తేజస్వి, తరుణ్ (ఫైల్) తల్లి సునీత (ఫైల్)
పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. కుటుంబ కలహాలతో గుండె రాయి చేసుకుంది. తను చనిపోతే పిల్లలు దిక్కులేనివారవుతారని భావించి వారిని చంపి, బలవన్మరణానికి పాల్పడింది. బాధ్యత లేని భర్త వేధింపులే కారణమని సమాచారం.
కర్ణాటక, మండ్య: కుటుంబ కలహాలతో ఒక తల్లి ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న ఘోర విషా దం శనివారం మండ్య జిల్లా మద్దూ రు తాలూకా హాగలహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రా మానికి చెందిన సుందరేశ్‌కు పొరుగు ప్రాంతానికి చెందిన సునీతతో చాలా కాలం క్రితం వివాహమైంది. కొద్దికాలంగా భార్యభర్తల మధ్య ఏదో విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోశుక్రవారం రాత్రి కూ డా భార్యభర్తల మధ్య రగడ జరిగింది.
గొంతుపిసికి చంపి..
దీంతో జీవితం మీద విరక్తి చెందిన సునీత శనివారం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలు తేజస్వి, తరుణ్‌లను గొంతు పిసికి చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిల్లల వయసు 12 ఏళ్లలోపేనని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా భర్త సుందరేశ్‌కు మరొక మహిళతో అక్రమ సంబంధం నెరుపుతూ ఉండడం, ఇదే విషయమై ప్రశ్నించిన భార్యను వేధించేవాడని, ఇదే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment