హుజారాబాద్‌లో దారుణం | husband murdered his wife | Sakshi
Sakshi News home page

హుజారాబాద్‌లో దారుణం

Published Fri, Feb 16 2018 8:29 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

husband murdered his wife - Sakshi

హత్యకు గురైన బాధితురాలు శైలజ

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. వివరాలు..పెద్దపాపయ్యపల్లి  గ్రామానికి చెందిన జయంత్‌(37), శైలజ(30) భార్యాభర్తలు. వీరి మధ్య రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పొలం వద్ద భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది.

కోపోద్రిక్తుడైన భర్త జయంత్‌, భార్యను  పంట  పొలంలోనే గడ్డపారతో పొడిచి చంపాడు.  అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. కుటుంబకలహాలతోనే హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement