మరో విషాదం.. శ్రీకాంత్‌ మృతి | Inter Caste Marriage Man Suicide Attempt Over Tartour | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి.. భార్యను దూరం చేశారని..

Published Thu, Sep 20 2018 11:27 AM | Last Updated on Thu, Sep 20 2018 1:41 PM

Inter Caste Marriage Man Suicide Attempt Over Tartour - Sakshi

చిట్టిపాక శ్రీకాంత్‌

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరమటంతో శ్రీకాంత్‌ భరించలేకపోయాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని..

సాక్షి, హైదరాబాద్‌ : పాతబస్తీలో మరో ప్రేమపెళ్లి కథ విషాదంగా ముగిసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తననుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత‍్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతోష్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని రక్షపురంకు చెందిన చిట్టిపాక శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను తీసుకెళ్లిపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరమవటంతో శ్రీకాంత్‌ భరించలేకపోయాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి తండ్రి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉండటంతో శ్రీకాంత్‌ కుటుంబసభ్యులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడని, దళితుడు కావటంతోనే అతడు కక్ష్యగట్టాడని శ్రీకాంత్‌ బందువులు ఆరోపిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement