సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీతోసహా డ్రైవర్ సజీవదహనం అయ్యారు. ఈ సంఘన నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదాని నొకటి ఢీ కొనడంతో ఒక లారీలో ఉన్న అయిల్ ట్యాంక్ పైర్ అవడంతో రెండు లారీలకు మంటలు వ్యాపించాయి.
దీంతో చిప్స్‌లోడుతో ఉన్న లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా టైల్స్‌లోడుతో ఉన్న మరో లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడు సమిశ్రీగూడెం అరుంధతిపేటకు చెందిన సవరపు హరీష్ (25) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.