
భర్త మహావీర్‌తో సంగీత(ఫైల్)
బన్సీలాల్‌పేట్: అత్తా, మామల వేధింపుల కారణంగా ఓ నవవధువు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మల్లేశం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బన్సీలాల్‌పేట్, బోయిగూడ ప్రాంతానికి చెందిన ప్లాస్టిక్ రీస్లైకింగ్ వ్యాపారి మహావీర్, మధ్యప్రదేశ్‌కు చెందిన సంగీతారాథోడ్ గత ఏప్రెల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ బోయిగూడలో జీవనం సాగిస్తున్నారు.
కొన్నాళ్ల పాటు పుట్టింటికి వెళ్లిన సంగీత గత నెల 25న భర్తతో కలిసి నగరానికి వచ్చింది. ఇటీవల అత్త, మామలతో గొడవ జరగడంతో అత్త మీనా చిక్కడపల్లిలో ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లిపోగా, మామ శాంతిలాల్ ఆఫీసులోనే ఉంటున్నాడు. దీంతో మనస్తాపానికిలోనైన సంగీత ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గాంధీనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అత్త,మామల వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి మధురా రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment