
సేలం (తమిళనాడు): వ్యాపారంలో నష్టంతో అప్పులపాలైన ఓ వ్యక్తి తీవ్ర మనోవేదనతో ఉరివేసుకుంటున్న దృశ్యాన్ని సెల్ఫీ తీసుకుని అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనను కొందరు వేధించారంటూ వారి పేర్లను లిస్టుగా రాసి జేబులో పెట్టుకున్నాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ ఘటన జరిగింది. సెమ్మనపట్టి యానాది కాలనీకి చెందిన సి.మురుగన్ (34) ఓ దుకాణం ఏర్పాటు చేసుకుని వస్త్ర వ్యాపారం చేసేవాడు.
వ్యాపారంలో నష్టాలు రావడంతో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుల వారి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. శనివారం రాత్రి కురువల్లి సమీపంలోని వెంకటరమణ ఆలయం కోనేరు వద్ద ఉరి వేసుకున్న విధంగా సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఒత్తిడి చేసిన అప్పుల వారి పేర్లు రాసి జేబులో పెట్టుకున్నాడు. పోలీసులు అక్కడకు చేరుకునేసరికే మురుగన్ చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment