
ఘటనా స్థలంలో విలపిస్తున్న కుటుంబ సభ్యులు
నెల్లూరు , సోమశిల: కాంక్రీట్ మిక్సర్ కింద నలిగిపోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన అనంతసాగరం మండలంలోని అలుగు వాగు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. సోమశిల ఎస్సై తిరుపతయ్య కథనం మేరకు..మండలంలోని వరికుంటపాడు చెందిన శెట్టిబోయిన మల్లేష్ (39) అలుగువాగు సమీపంలో నడిచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అలుగువాగు సమీపంలో చేపడుతున్న రోడ్డు పనులకు సంబంధించిన కాంక్రీట్ మిక్సర్ అదుపుతప్పి మల్లేష్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మల్లేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లేష్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment