తెనాలిలో దారుణం: ప్రియురాలి మీద అనుమానంతో.. | Man Killed Lover In Tenali | Sakshi
Sakshi News home page

తెనాలిలో దారుణం: ప్రియురాలి మీద అనుమానంతో..

Published Thu, Feb 21 2019 4:18 PM | Last Updated on Thu, Feb 21 2019 5:11 PM

Man Killed Lover In Tenali - Sakshi

ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కాగా సత్యనారాయణకు..

సాక్షి, గుంటూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి మీద అనుమానంతో ఆమెపై దాడి చేసి అతికిరాతంగా గొంతు కోసి చంపాడు ప్రియుడు. ఈ సంఘటన గురువారం తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెనాలికి చెందిన సత్యనారాయణ, జ్యోతిలు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కాగా సత్యనారాయణకు జ్యోతిపై ఉన్న ప్రేమ కాస్తా అనుమానంగా మారింది.

అనుమానం పెరిగి పోయి విచక్షణ కోల్పోయాడు. గురువారం జ్యోతిపై దాడికి పాల్పడి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement