
చప్రా: బిహార్‌లో మరో మూకదాడి జరిగింది. శుక్రవారం సరాన్ జిల్లాలో గేదెను దొంగిలించబోయారన్న కారణంతో జరిగిన ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాలు ఈ దాడిలో పాల్గొన్నాయని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారని ఎస్పీ హర్‌కిషోర్ తెలిపారు. ఇద్దరుముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. అయితే అంతకు మించి వివరాలు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. మరోవైపు దొంగిలించే ప్రయత్నం చేయకపోయినా, కావాలనే కొట్టి చంపారని మృతుల బంధువులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment