
శవాన్ని వెలికి తీస్తున్న దృశ్యం
చిత్తూరు , తంబళ్లపల్లె : తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య ఇంటిలోనే చంపేసింది. ప్రియుడి సహకారంతో పాతిపెట్టింది. భర్త అదృశ్యమయ్యాడని నాటకం ఆడింది. ఐదు నెలల తర్వాత పోలీసులు మిస్టరీని ఛేదించారు. ములకలచెరువు సీఐ శ్రీనివాసులు సోమవారం ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తంబళ్లపల్లె మండలం కోట కొండ పంచాయతీ ఎగువతండాకు చెందిన రమణమ్మ(45)కు, అదే పంచాయ తీ బందార్లపల్లెకు చెందిన మదన్‌మోహన్‌రెడ్డితో 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. రమణమ్మ భర్త బుక్యామారూనాయక్ (60) ఈ విషయమై మందలించేవాడు. దీంతో విసుగు చెందిన రమణమ్మ భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. మే నెల 25వ తేదీన ఇంటిలోనే మద్యం తాగుతున్న భర్తతో గొడవపడింది. ఓ పథకం ప్రకారం ఇంటిలో ఉన్న గడువు తీరిన పలురకాల మాత్రలను పొడి చేసి మద్యంలో కలిపి భర్తకు తాగించింది. అత ను అపస్మారక స్థితిలోకి చేరుకోగానే చంపేసింది. ఈ విషయాన్ని ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందించింది. అదేవిధంగా కోసువారిపల్లె పంచా యతీ చిన్నప్పరెడ్డిగారిపల్లెకు చెందిన సుబ్బారెడ్డికి ఎగువతండాలోని మరో మహిళతో వివాహేతర సంబంధం కల్పిం చేందుకు రమణమ్మ సహకరించింది.
దీం తో రమణమ్మ అతని సహకారం కోరింది. ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి ఇద్దరూ తండాకు చేరుకుని అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని సంచిలో మూట కట్టి ట్రాక్టర్‌లో తీసుకెళ్లి రేణిమాకులపల్లె పంచాయతీ జోగువానిబురుజు సమీపంలోని ఈదలవంక వాగులో పాతిపెట్టారు. అదే నెల 29వ తేదీ రమణమ్మ, కుమారు డు హరినాయక్‌తో కలిసి మారూనాయక్ అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానితులను విచారించినా ప్రయోజనం లేదు. దీంతో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ శివకుమార్ ప్రత్యేక నిఘా పెట్టారు. ఫోన్‌కాల్స్ ద్వారా నిందితులను గుర్తించి అదృశ్యమైన వ్యక్తిని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రమణమ్మ పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఆదివారం ఆర్‌ఐ బాలాజీ వద్ద లొంగిపోయింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఆదివారం సాయంత్రం తంబళ్లపల్లె గ్యాస్ గోడౌన్ వద్ద ఉన్న మదన్‌మోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. మారూనాయక్ మృతదే హానికి సంఘటన స్థలంలోనే తహసీల్దార్ సురేష్‌బాబు సమక్షంలో సోమవా రం మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వైద్యులు రామచంద్రప్రసాద్‌రావు పోస్టుమార్టం చేశారు. నిందితుల కాల్ డేటా సేకరించేందుకు చేసిన కృషి చేసిన ఐడీ పార్టీ పోలీసులు వెంకటేష్, సిరాజ్, శ్రీకాంత్‌ను అభినందించి నగదు రివార్డు అందజేశారు. ములకలచెరువు ఎస్‌ఐ ఈశ్వరయ్య, పెద్దతిప్పసముద్రం ఎస్‌ఐ రవికుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment