
బీర్కూర్‌లో స్వాధీనం చేసుకున్న మద్యం దోమకొండ మండలం అంబారిపేటలో..
సాక్షి, బీర్కూర్ (నిజామాబాద్): రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. గురువారం మండలంలోని కిష్టాపూర్, బీర్కూర్, చించోలి గ్రామాల్లో గల బెల్టుషాపులపై బీర్కూర్ ఎస్‌ఐ పూర్ణేశ్వర్ సిబ్బందితో కలిసి దాడులు చేశా రు. నిబంధనలకు విరుద్దంగా మద్యం విక్రయిస్తు న్న నలుగురిపై కేసు నమోదు చేశారు. వారి నుం చి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసి సీజ్ చేశారు.
పెద్దమల్లారెడ్డి గ్రామంలో..
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రా మంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాప్‌పై దాడి చేసినట్లు ఎస్‌ఐ రాజుగౌడ్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన మంద శంకర్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడన్న స మాచారం మేరకు ఆయన ఇంటిపై దాడి చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన 12 బీరుబాటిళ్లు లభించాయని వాటిని స్వాధీనం చేసుకుని ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
అంబారిపేటలో..
దోమకొండ: మండలంలోని అంబారిపేట బెల్ట్ షా పుపై గురువారం పోలీసులు దాడి చేసి అక్రమం గా నిల్వ ఉన్న మద్యంను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. మద్యం అమ్ముతున్న నిర్వాహకుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, అక్రమంగా మద్యం అమ్మి తే జైలుకు పంపుతామని ఆయన పేర్కొన్నారు.