వరంగల్ రైల్వేగేట్: సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వ్యవసాయ కూలీ కోట కృష్ణారెడ్డి(62) సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు వెళ్తున్నాడు. ఇతను అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున బాత్‌రూంకని వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి ప్రయాణికులు గమనించి రైల్వే అధికారులకు సమాచారమందించారు. రైలు వరంగల్ స్టేషన్‌కు చేరగానే పోలీసులు రైలు వద్దకు వచ్చి బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు వరంగల్ జీఆర్‌పీ సీఐ వెంకటరత్నం తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏఎస్సై పరశురాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సింహపురిలో ప్రయాణికుడు హఠాన్మరణం
Published Tue, Jan 2 2018 8:21 PM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM
Advertisement
Advertisement