simhapuri express
-
‘సింహపురి’లో నగల బ్యాగ్ మాయం
సాక్షి, ఒంగోలు: సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలులోలో ప్రయాణికురాలి నగల బ్యాగ్ మాయం అయింది. రూ.35 లక్షల విలువ చేసే నగలు ఉన్న బ్యాగ్ పోయిందని రావిపాటి సుశీల అనే ప్రయాణికురాలు ఒంగోలు రైల్వేపోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు హైదరాబాద్ నుంచి ఇదే రైలులో ఒంగోలు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సింహపురిలో ప్రయాణికుడు హఠాన్మరణం
వరంగల్ రైల్వేగేట్: సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వ్యవసాయ కూలీ కోట కృష్ణారెడ్డి(62) సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు వెళ్తున్నాడు. ఇతను అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున బాత్రూంకని వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి ప్రయాణికులు గమనించి రైల్వే అధికారులకు సమాచారమందించారు. రైలు వరంగల్ స్టేషన్‌కు చేరగానే పోలీసులు రైలు వద్దకు వచ్చి బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు వరంగల్ జీఆర్పీ సీఐ వెంకటరత్నం తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏఎస్సై పరశురాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సింహపురి రైలు వేళల్లో మార్పు
అక్టోబరు 1 నుంచి అమలు ఫలించిన ఎంపీ మేకపాటి కృషి నెల్లూరు(సెంట్రల్): జిల్లా ప్రయాణికుల సాక్యర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధుల వినతుల మేరకు సింహపురి రైలు వేళలను మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో సింహపురి గూడూరులో రాత్రి 10.10 గంటలకు బయలుదేరేది. నెల్లూరుకు రాత్రి 11 గంటలకు చేరుకునేది. సికింద్రాబాదుకు మరుసటి రోజు మధ్యాహానానికి చేరుకుంటుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ప్రయాణికుల వినతుల మేరకు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రైల్వే మంత్రి, జీఎంను పలుమార్లు సింహపురి వేళలను మార్చాలని కోరుతూ వచ్చారు. ఇటీవల నెల్లూరుకు వచ్చిన రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సైతం సింహపురి వేళల మార్పు విషయాన్ని ఎంపీ మరోమారు గుర్తు చేశారు. దీంతో ఎట్టకేలకు సింహపురి వేళల్లో మార్పులను తీసుకువచ్చారు. మార్చిన వేళల ప్రకారం గూడూరులో రాత్రి 6.50 గంటలకు బయలుదేరుతుంది. నెల్లూరుకు 7.18 గంటలకు, కావలికి 7.55, ఒంగోలుకు 8.40, చీరాలకు 9.30, విజయవాడకు 11.10కు చేరుకుంటుంది. విజయవాడలో 11.20 గంటలకు బయలుదేరి సికింద్రాబాదుకు మరుసటి రోజు వేకువన 5.40 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాదు– గూడూరు రైలు వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. అక్టోబరు 1 నుంచి మారిన వేళలు అమలవుతాయని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. -
పట్టపగలే దోపిడీ
♦ అప్పాడిప్యూటీ డెరైక్టర్ రత్నపై దాడి ♦ బంగారం, రూ. 2 వేల నగదు అపహరణ ♦ చికిత్స కోసం నెల్లూరు అపోలోకు తరలింపు గూడూరు/నెల్లూరు(అర్బన్) : సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో పట్టపగలే దారుణం... హైదరాబాద్‌లోని అప్పాలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఎస్ఎం రత్నపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి బంగారం, నగదు అపహరించాడు. సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయాణిస్తున్న ఆమెపై నెల్లూరు రైల్వే స్టేషన్లో రైలు కదులుతుండగా దుండగుడు అకస్మాత్తుగా ప్రవేశించి దాడి చేశాడు. అసలేం జరిగింది? సూళ్లూరుపేటకు చెందిన అప్పాలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న రత్న చెన్నైకు వెళ్లేందుకు చార్మినర్ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ చేసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే సరికి రైలు వెళ్లిపోవడంతో గూడూరు వరకూ వచ్చేందుకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లోని వికలాంగుల బోగీలో ఎక్కారు. ఉదయం 9 గంటల సమయానికి రైలు నెల్లూరుకు చేరుకోవడంతో బోగీలోని వికలాంగులందరూ దిగారు.. బోగీలో ఆమె ఒక్కరే మిగిలారు. కదులుతున్న రైలులోకి ఓ దుండగుడు అకస్మాత్తుగా ఎక్కి మనుబోలు దాటిన తర్వాత ఆమెపై తీవ్రంగా దాడిచేసి రెండు బంగారు గొలుసులు, రెండు గాజులు, రెండు ఉంగరాలతో పాటు రూ. 2 వేల నగదు, ఐడీకార్డులు లాక్కొని.. చల్లకాలువ దగ్గర రైలు నెమ్మదిగా వెళుతుండటంతో దిగి పారిపోయాడు. గూడూరు రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఆమె అరుపులు విని పక్కబోగీ ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ రత్నను మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలోకు తరలించారు. ఆయుధాలు లేకుండా ఎలా ప్రయాణం? సాధారణంగా ఐపీఎస్ హోదా పొంది తే తగిన సెక్యూరిటీతో ప్రయాణం చేస్తారు. కనీసం ఆయుధాన్నైనా పక్కన ఉంచుకుంటారు. అలాంటిది ఏమరుపాటుతో అదీ ఒంటరిగా ఎవరూ లేని వికలాంగుల బోగీలో ప్రయాణించడమే ఆమె చేసిన పాపమైంది. పట్టపగలే ఒక అధికారి దొంగల బారిన పడ్డారంటే రైళ్లలో భద్రతా లోపాలు మరోసారి వెలుగుచూశాయి. -
మహిళా ఐపీఎస్‌పై దాడి
సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో నగలు దోచుకెళ్లిన దుండగుడు నెల్లూరు జిల్లాలో ఘటన రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ టీం నెల్లూరు(అర్బన్)/గూడూరు: సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళా ఐపీఎస్ అధికారిపైనే దాడి చేసి నగలు దోచుకెళ్లిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలి తమ్ముడు మురళీకృష్ణ, నెల్లూరు రైల్వే సీఐ నరసింహరాజు కథనం ప్రకారం.. ఐపీఎస్ అధికారి ఎస్.ఎం.రత్న(సేనాని మునిరత్న) స్వస్థలం సూళ్లూరుపేట కాగా చెన్నైలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తూ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు చెన్నైలో నివసించే తమ్ముడు మురళీకృష్ణ వద్దకు వెళ్లి వచ్చేవారు. అదే క్రమంలో శుక్రవారం రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టేషన్లో దిగారు. అక్కడి నుంచి చెన్నైకు వెళ్లేందుకు ఏమైనా రైళ్లు ఉన్నాయా? అని టీసీని అడగడంతో గూడూరు జంక్షన్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె వచ్చిన సింహపురిలోనే మళ్లీ గూడూరుకు బయలుదేరారు. అయితే ఆమె అనుకోకుండా వికలాంగుల బోగీలో ఎక్కారు. ఆ బోగీలో ఆమెతో పాటు మరోవ్యక్తి మాత్రమే ఉన్నారు. మనుబోలు దాటగానే ఆమెపై బోగీలోని వ్యక్తి దాడి చేశాడు. ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఆమె తేరుకునేలోపు ఆగంతకుడు బంగారు చైను, గాజులు, రెండు ఉంగరాలు, పర్సులో ఉన్న రూ. 2వేల నగదు లాక్కున్నాడు. గూడూరు సమీపంలో రైలు నెమ్మదికాగానే దూకేసి పారిపోయాడు. తేరుకున్న రత్న గూడూరులో దిగి పోలీసులకు సమాచారమిచ్చారు. గూడూరు పోలీసులు అక్కడి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలోకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ముఖంపై తీవ్రంగా కొట్టడంతో ఆ భాగం ఉబ్బిందని వైద్యులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. -
'అప్పా' అధికారిణిపై రైల్లో దాడి
గూడూరు: ఓ ఐపీఎస్ అధికారిణిపై సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఓ దుండగుడు దాడి చేసి కొట్టడంతోపాటు ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పరారయ్యాడు. ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని అప్పాలో పనిచేసే తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాన్ కేడర్ ఐపీఎస్ అధికారిణి ఎస్.ఎం రత్న చెన్నై వెళ్లేందుకు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో సింహపురి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఆమె వికలాంగుల బోగీలో ఎక్కి కూర్చున్నారు. గూడురులో రైలు మారి చెన్నైకు మరో రైలులో వెళ్లాల్సి ఉంది. అయితే, రైలు శనివారం ఉదయం నెల్లూరు స్టేషన్‌కు రాగానే వికలాంగుల బోగీలో ఉన్న అందరూ దిగిపోయారు. బోగీలో రత్న ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అదే బోగీలోకి ఎక్కాడు. రైలు స్టేషన్ దాటిన తర్వాత ఆమెపై దాడి చేసి కొట్టాడు. రత్నా వద్ద ఉన్న రెండు బంగారు ఉంగరాలు, గాజులు, గొలుసు, రూ.2 వేల నగదు, ఐడీ కార్డు తీసుకుని గూడురులో దిగి పరారయ్యాడు. దుండగుడి దాడిలో అధికారిణి ముఖంపై గట్టి దెబ్బలు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆమె గూడురు రైల్వే స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. -
సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల బీభత్సం