
బైక్ చోరీ కేసులో పట్టుబడిన విక్రమ్
సాక్షి, రాజంపేట : కడప ఏఆర్ కానిస్టేబుల్ వెంకటరమణ కుమారుడు విక్రమ్ బైక్ చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. రాజంపేట పట్టణ ఎస్‌ఐ రాజగోపాల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆర్‌ఎస్ రోడ్డులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ సమీపంలో రాజుకు సంబంధించిన బైక్ గత నెల 23న చోరీకి గురైంది. దీనిని కడపకు చెందిన తిరుపతి విక్రమ్ అపహరించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్‌ఐ తెలిపారు. విక్రమ్ కడప ఏఆర్ కానిస్టేబుల్ వెంకటరమణ కుమారుడు. అతను కడపలో డిగ్రీ చేస్తున్నాడు. తన సోదరి రాజంపేటలో ఉన్నందున ఇక్కడికి వచ్చానని, ఈ క్రమంలోనే చోరీ చేసినట్లు నిందితుడు తెలిపాడు. అతన్ని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.