
నాగరాజు మృతదేహం
జన్నారం(ఖానాపూర్) : అతివేగం యువకుని ప్రాణాలు తీసింది. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని ఒకపక్క పోలీసులు చెబుతు న్నా పట్టించుకోకుండా మద్యం సేవించి అతివేగంగా వాహనం నడిపి అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన ఉట్నూర్ మండలంలోని కన్నెపల్లిలో చోటు చేసుకుంది. ఉట్నూర్ మండలం కన్నెపల్లికి చెందిన తొడసం నాగరాజు(19) తన స్నేహితులైన ఇంద్రవెల్లికి చెందిన మె స్రం మారుతి, గొడిసర్యాలకు చెందిన జుగునక మ హేశ్‌లతో కలిసి శుక్రవారం ద్విచక్ర వాహనంపై ఉ ట్నూర్ నుంచి జన్నారం మండలం ధర్మారం బయలు దేరారు.
మార్గమధ్యలో ఇందన్‌పల్లి వద్ద మద్యం సేవించి జన్నారం మీదుగా ధర్మారం వెళ్లి స్నేహితున్ని కలిసి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ధర్మారం, జన్నారం గ్రామాల మధ్యన ఉన్న కల్వర్టును ఢీకొట్టా డు. దీంతో బైక్ నడుపుతున్న నాగరాజుకు తీవ్రగాయాలై సంఘటనాస్థలంలోనే మృతి చెందగా అతని స్నేహితులిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న నాగరాజు తండ్రి నాలుగేళ్ల క్రితమే మృతి చెందగా ప్రస్తుతం తల్లి ఉన్నా రు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని స్వల్పగాయాలైన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అతివేగమే ప్రమాదానికి కారణమని ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట్‌కు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment