డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ పోలీసులు
ఇద్దరు యువకులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులకు చిక్కారు.వారికి బ్రీత్ ఎనలైజింగ్ పరీక్ష నిర్వహించగా 31 పాయింట్లు చూపించడంతో కేసు నమోదు నమోదు చేశారు.
అదే హైదరాబాద్‌లో పట్టుబడిన వారికి 35 పాయింట్లు దాటితే కేసు నమోదయ్యేది. కానీ, కొంతకాలంగా వేర్వేరు విధానాలకు రాష్ట్ర పోలీస్ శాఖ చెక్ పెట్టింది. అంతటా ఒకే విధానం తీసుకువచ్చారు. ట్రాఫిక్‌తో పాటు సివిల్ విభాగంలోనూ జిల్లాలో ఒకే రూల్ అమలు చేస్తున్నారు.
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర రాజధాని తరహాలో అన్ని జిల్లాల్లోనూ ఒకే రకమైన పోలీసింగ్ విధానం అమలు చేస్తున్నారు. సివిల్, ట్రాఫిక్ విభాగాల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, జిల్లాలు అనే తేడా లేకుండా అంతటా ఒకే రకమైన విధానం పాటిస్తున్నారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసు కాప్–కనెక్ట్ పేరుతో వాట్సాప్ యాప్ క్రియేట్ చేశారు. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన విధానం అమలవుతోంది. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు.
పక్కాగా ట్రాఫిక్ నిబంధనలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలను పక్కా గా అమలు చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారులు 65, 163తోపాటు పలు రోడ్లపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అంగవైకల్యం బారిన పడుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ విషయంలో యువతపై ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడుతోంది.
అలాగే హెల్మెట్ లేకుండా, మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవడం, మైనర్లు వాహనాలు నడపడంపై ఉక్కుపాదం మోపడానికి చట్టాలను కఠినం చేశారు. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాల నివారణకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే ఇప్పటి వ రకు బాధ్యులకు మాత్రమే కౌన్సెలింగ్ ఇచ్చేవారు. అంతేకాకుండా వారిని కోర్టులో హాజరుపరిచగా జడ్జిలు ఇచ్చిన తీర్పు మేరకు జరిమానాతోపాటు ఒకటి రెండు రోజులు జైలు శిక్ష విధిస్తున్నారు. తాజాగా వచ్చిన నిబంధనల ప్రకారం పట్టుబడి వారే కాకుండా వారి కుటుంబ సభ్యులకు సైతం కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మద్య సేవించి వాహనాలు నడిపిన డ్రైవర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.
35కు పెరిగిన పాయింట్లు
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడి న వారికి బ్రీత్ ఎనలైజింగ్ పరీక్ష నిర్వహిస్తే 31పాయింట్లు చూపించినట్లయితే గతంలో కేసు నమో దు చేసేవారు. అయితే హైదరాబాద్‌లడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో హైదరాబాద్‌లో 35 పాయింట్లు చూపెడితే కేసు నమోదయ్యేది. కానీ, ప్రస్తుతం రాష్ట్రమంతటా 35పాయింట్ల విధానం అమలు చేస్తున్నారు.
మోటారు వెహికిల్ యాక్ట్ ప్రకా రం ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనే కాకుండా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా, మైనర్లు, లైసెన్స్‌లు లేనివారు వాహనం నడిపినా వారి వాహనం జప్తు చేస్తారు. అలాగే వారిని కూడా న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం ద్వారా న్యాయమూర్తుల శిక్షకు గురవుతారు. ఇందులో నగదు జ రిమానాలు, జరిమానాలు, జైలు శిక్ష పడుతోంది.
మైనర్లు నడిపితే జువైనల్‌కు..
మావోడు బండి బాగా నడుపుతుండు.. అని సం బర పడిపోయే మైనర్ పిల్లల తల్లిదండ్రులు ఇకపై అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే మైనర్లు నడిపే వాహన యాజమానులతోపాటు వారిపైనా కేసు నమోదు చేసి జైలుకు పంపించే చట్టాన్ని అమలు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. 18 సంవత్సరాల వయస్సు లోపు వారు వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేసి జువైనల్ హోంకు పంపిస్తారు.
అలాగే వారు నడిపిన వాహనం యాజమానిపై కేసు నమోదు చేస్తారు. అదే విధంగా లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాన్ని నడిపితే జువైనల్ హోంకు, మేజర్లు వాహనం నడిపితే జైలుకు పంపిస్తారు. అంతేకాకుండా ఈ రెండు సందర్భాల్లో మేజర్లు లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనం నడిపిన సందర్భాలలో వాహన యాజమానులకు కూడా జరిమానా విధించి జైలుకు పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment