డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడిన వారితోపాటు కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐలు(ఫైల్),
భువనగిరి క్రైం : ట్రా‘ఫికర్’ లేకుండా సాఫీగా ప్రయాణం సాగడానికి భువనగిరి ట్రాఫిక్ పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు, ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ ధరించనివారికి, డ్రైంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలను షార్ట్‌ఫిల్మ్‌ల రూపంలో నివారించడానికి ప్రయత్నిస్తున్నారు.
భువనగిరి పట్టణం రాచకొండ కమిషనరేట్ పరిధి లోకి వెళ్లిన∙తర్వాత భువనగిరిలో ట్రాఫిక్ విభా గం ప్రత్యేకంగా ఏర్పాటైంది. పట్టణంలో ట్రాఫి క్‌ను నియంత్రించడానికి ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్లను నియమించింది. ప్రతిరోజు భువనగిరి పట్టణంతో పాటు బైపాస్ రోడ్డుపైన నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి నిబంధనలు పాటించేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక శ్రద్ధ
ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మద్యం తాగి హైవేపై, పట్టణంలో వా హనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం, కోర్టుకు అప్పగిస్తున్నారు. అంతేకాదు వారికి మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేస్తున్నారు.
ఇప్పటి కే ప్రతి మంగళవారం, శుక్రవారం మద్యం తాగి వాహనాలు నడిపిన వారితో పాటు, వారి వారి కుటుంబ సభ్యులకు సైతం భువనగిరి ట్రాఫిక్ పో లీస్‌స్టేషన్‌లో సీఐలు, ఎస్‌ఐలు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే దుష్ఫలితాలను ఫొటోల రూపంలో చూపిం చడానికి వినూత్నమైన బోర్డులను ఏర్పాటుచేశారు.
కొండమడుగు నుంచి రాయిగిరి వరకు 14 బోర్డులను ఏర్పాటుచేశారు. వీటితో పాటుగా ఈ హైవేపైనే రోడ్డు పక్కన ఉన్న జంక్షన్లను సులభంగా గుర్తించడానికి బ్లింకర్స్‌ను ఏర్పాటుచేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలకు ప్రత్యేకంగా స్టిక్కర్లను అతికించి ప్రచారం చేశారు.
ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్
పట్టణంలోని ఆటో డ్రైవర్లందరికీ ట్రాఫిక్ సీఐలు శివశంకర్‌గౌడ్, రాజశేఖర్‌రెడ్డిలు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, పత్రాలు సరిగ్గా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా, ఆటోలో లౌడ్‌స్పీకర్స్‌ను నిషేధించాలని, తప్పనసరిగ్గా ఇన్సురెన్స్ సదుపాయం కలిగిఉండాలని, వేగంగా ప్రయణించడం వలన కలిగే నష్టాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు రోడ్డు పక్కన పం డ్లు అమ్ముకునే వారికి, చిన్న చిన్న దుకాణాలు ఏ ర్పాటుచేసుకున్న వారికీ కౌన్సెలింగ్ ఇచ్చారు.
హెల్మెట్ వాడకంపై ప్రచారం
ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్ ధరించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేసేందుకు ట్రాఫిక్ సీఐ శివశంకర్ సిబ్బందితో కలిసి భువనగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించి ద్విచక్రవాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు హెల్మెట్ వాడకం తప్పనిసరి అని వివరిస్తున్నారు.
త్వరలో ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు
త్వరలోనే భువనగిరిలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేయనున్నారు. ఈ సిగ్నల్స్‌ను బెల్ సంస్థ అమరుస్తుంది. ఇప్పటికే పట్టణంలో ఎక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనే అంశంపై ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మనోహర్ భువనగిరి పట్టణంలో పర్యటించి ప్రధాన కూడళ్లను పరిశీలించారు. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో ట్రాఫిక్ సమస్య చాల వరకు తీరుతుందని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
నిబంధనలపై విద్యార్థులకూ అవగాహన
రహదారిపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పాటించాల్సిన నిబంధనలు, పాదాచారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌ల రూపంలో త్వరలోనే ప్రతి పాఠశాల, కళాశాలకు వెళ్లి అవగాహన కల్పించడానికి వీడియో కూడా తయారు చేశారు. వీటితో పాటు పట్టణంలోని లోకల్ టీవి చానెల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.
వీటితో పాటుగా పట్టణంలో త్వరలోనే డిజిటల్ బోర్డులను ఏర్పాటుచేయనున్నారు. అలాగే పట్టణంలోని రహదారులపై వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేస్తే వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు రికవరీ వ్యాన్‌ను భువనగిరి పట్టణంలో సైతం ప్రవేశపెట్టారు.
ఈ వాహనం ద్వారా ట్రాఫిక్ పోలీసులు ప్రతి రోజు రోడ్డుపైన వాహనాలను నిలపొద్దని ప్రచారం చేస్తూ రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment