
ఉప్పల్: వివాహం కావడంలేదనే మనస్తాపంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ శారదానగర్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పంజాల రామ్మోహన్ గౌడ్ కుమారుడు పంజాల నిఖిల్‌గౌడ్ (24) ఎరీనా టవర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా వివాహం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక కారణంతో అతడి పెళ్లి జరగడంలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన నిఖిల్‌గౌడ్ సోమవారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిఖిల్ తల్లదండ్రులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తలుపు వేసుకొని గడియ పెట్టిఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో వెనుక తలుపులను పగులగొట్టి లోపలికి వచ్చి చూడటంతో ఉరి వేసుకొని ఉన్నాడు. హుటాహుటిన పక్కనే ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment