సాక్షి, విజయవాడ : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇంజనీరింగ్ విద్యార్థినిలను మోసం చేసిన సంఘటన నగరంలో వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినిల నుంచి వేలరూపాయలు వసూలుచేసి బోర్డు తిప్పేయడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. ప్రో సాఫ్ట్‌వేర్ సంస్థ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థినులను సంప్రదించింది. దీని నిర్వహకుడు సాయి ధరణీధర్ విద్యార్థినిలు నమ్మేలా కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాడు.
ఇతని మాయమాటలు నమ్మిన విద్యార్థినిలు అడిగనంత డబ్బులు ఇచ్చేశారు. వారి స్నేహితులతో కూడా డబ్బులు కట్టించారు. ఒక్కో విద్యార్థిని దగ్గర ఐదు వేల నుంచి ముప్పై వేల వరకూ వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్నాక శిక్షణ అంటూ రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన విద్యార్థినిలు అతన్ని నిలదీయగా బోర్డు తిప్పేశాడు. దీంతో వారు ఆ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment