
భీమ్‌గల్(బాల్కొండ): జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి శివాల యంలోని శివుని గర్భగుడిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించు కుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామం లో శనివా రం జరిగింది. గ్రామానికి చెందిన తోట రాజమణి (22) చిన్న వయసులోనే తల్లిదం డ్రులను కోల్పోయింది. దీంతో తన అక్కలు, సమీప బంధువుల వద్ద ఉండేది. డిగ్రీ మధ్యలో చదువు మానేసిన రాజమణి మానసిక పరిస్థితి కొంత కాలంగా బాగా లేదు.
ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా హోమియో చికిత్సను కూడా తీసుకుంటోంది. శనివారం ఉదయం గ్రామ శివారు లోని రాజరాజేశ్వర స్వామి వారి ఆల యానికి వెళ్లిన రాజ మణి గర్భాల యంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఊహించని ఈ ఘటనకు ఆలయ ఆవరణలో ఉంటున్న అయ్యప్పభక్తులు దిగ్భ్రాంతి చెందారు. తేరుకుని మంటలు ఆర్పి నిజామా బాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 80 శాతం ఒళ్లు కాలిన రాజమణి చికిత్స పొందుతూ మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment