
చెన్నై : తమిళనాడులో ప్రసిద్ధి చెందిన హోటల్ శరవణభవన్ యజమాని రాజగోపాల్‌కు ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధించిన సుప్రీంకోర్టు జూలై 7లోగా కోర్టులో లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తూ రాజగోపాల్ బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించాడు. రాజగోపాల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ లొంగిపోయేందుకు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని, ఆయన వెంటనే కోర్టుకి లొంగిపోవాలని జస్టీస్ ఎన్‌వీ రమణ మంగళవారం ఆదేశించారు.
శాంతాకుమార్ హత్య కేసులో రాజగోపాల్ సహా 11మందికి సర్వోన్నత న్యాయస్ధానం మార్చిలో జీవితఖైదును ధృవీకరించింది. ఈ కేసు విషయంపై కోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
హోటల్ శరవణభవన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే రామస్వామి కూతురు జీవజ్యోతి (20) అదే హోటల్‌కు చెందిన మరో బ్రాంచ్‌లో పనిచేసేది. అయితే ఆమెపై కన్నెసిన రాజగోపాల్ జీవజ్యోతిని పెళ్లి చేసుకొవాలనుకున్నాడు. కాని ఆమె దీనికి తిరస్కరించి అదే హోటల్‌లో పని చేస్తున్నశాంతాకుమార్‌ను వివాహం చేసుకుంది. అప్పటికి మారని రాజగోపాల్ తనని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. దీంతో ఆమె భర్త శాంతకుమార్‌ను కిడ్నాప్ చేయించి హత్య చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment