నగదును సీజ్ చేస్తున్న పోలీసులు
మహబూబ్‌నగర్ క్రైం: ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. పట్టణ ప్రధాన రహదారులు, బైపాస్‌లు, గ్రామ శివారులు, జాతీయరహదారిపై పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. శుక్రవారం సాయంత్రం పాలమూరులో ట్రాఫిక్ సీఐ అమర్‌నాథ్ రెడ్డి పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.5లక్షలను పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ తన ద్విచక్ర వాహనంలో రూ.5లక్షలను తీసుకుని వెళ్తుండగా పోలీసులు తనిఖీల్లో పట్టుబడ్డాయి. దీంతో అతని దగ్గర ఆ నగదుకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. సీఐ ఆ నగదును టూటౌన్ పోలీసులకు అప్పగించారు.
రూ.1.37 లక్షలు పట్టివేత
అలంపూర్: జాతీయరహదారి పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో నిత్యం నగదు పట్టుబడుతోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను చెక్‌పోస్టు వద్ద పోలీసులు అణువణు వు సోదా చేస్తున్నారు. మద్యం, నగదు అక్రమంగా తరలించకుండా కట్టడి చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తనిఖీలు చేపట్టగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న షఫీ అనే వ్యక్తి కారులో రూ.1.37 లక్షల నగదు పట్టుబడింది. ఈ మేరకు ఏఎస్‌ఐ వేమన్న నగదును రిటర్నింగ్ అధికారికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment