పటమట(విజయవాడ తూర్పు): ఓ కాంట్రాక్టర్, ట్రాన్స్‌పోర్టు సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీల్లో నెలకొన్న వివాదం చివరికి గన్‌తో బెదిరించే వరకు వెళ్లింది. రాజకీయ నాయకుల పేరుతో కొంతమంది తమ ఇంట్లో చొరబడి, చాతీపై గన్ గురి పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
వివరాలు.. యార్లగడ్డ ప్రవీణ్ కుమార్ తెలంగాణలోని ఓ కాంట్రాక్టర్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకుని పలు నిర్మాణ పనులకు వాహనాలు పెట్టాడు. ఈ నేపథ్యంలో హరిప్రియ బల్క్ కొరియర్ సర్వీస్ సంస్థకు చెందిన కోనేరు శివశంకర్ పరిచయమయ్యాడు. ప్రవీణ్‌కుమార్‌కు లారీలను మాట్లాడుకున్నాడు. 40 రోజుల పాటు పనులకు వినియోగించుకున్నాడు. దీనికి సంబంధించి హరిప్రియ ట్రాన్స్‌పోర్టు సంస్థకు ప్రవీణ్ కుమార్ రూ.1.17 లక్షలు బాకీ పడ్డాడు. ఆ డబ్బు వసూలు చేసేందు ఈ నెల 27వ తేదీ కోనేరు శివశంకర్, సతీష్, సంతోష్, కోటేశ్వరరావులతో కలిసి మురళీనగర్‌లోని ఇంట్లోకి ప్రవేశించి భార్య వద్ద ఖాళీ చెక్కులు, ప్రాంసరీనోట్లు రాయించుకున్నారని, అక్కడితో ఆగకుండా విజయవాడ ఆటోనగర్‌లోని 5వ రోడ్డులో ఉన్న తన కార్యాలయంలోకి ప్రవేశించి తనను గన్‌తో బెదిరించారని ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టామని పటమట పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment