ఈ జవాను నిత్య పెళ్లికొడుకు! | Three ex-wives thwart man's fourth attempt at marriage | Sakshi
Sakshi News home page

ఈ జవాను నిత్య పెళ్లికొడుకు!

Published Tue, Oct 24 2017 3:36 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

Three ex-wives thwart man's fourth attempt at marriage  - Sakshi

మైసూరు: విడాకులివ్వకుండానే ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్న ఓ జవాను నాలుగో పెళ్లికి సిద్ధమై కటకటాల పాలయ్యాడు. కర్ణాటకలోని మైసూరు జిల్లా  లక్కికుప్పె గ్రామానికి చెందిన శివనంజు (35) భారత సైన్యంలో జవానుగా పనిచేస్తున్నాడు. 2007 మేలో వరలక్ష్మి అనే మహిళను పెళ్లిచేసుకున్నాడు. ఆమె గర్భం దాల్చగానే పుట్టింటికి పంపించి వేధింపులు మొదలుపెట్టాడు.

దీంతో 2009లో ఆయనపై గృహహింస కేసు నమోదైంది. ఇంతలోనే శ్వేత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులకే ఆమె అతడిని వదిలి వెళ్లిపోయింది. తర్వాత ఆశారాణి అనే యువతిని మూడో పెళ్లి చేసుకోగా.. కొద్దిరోజులకే వీరిద్దరూ వేరుపడ్డాడు. ఈ నేపథ్`యంలో నాలుగో పెళ్లికి సిద్ధమైన శివనంజును మొదటి భార్య సోదరుడు గుర్తించి  పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కటకటాల పాలయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement