
సాక్షి, తూర్పుగోదావరి : భర్తతో గొడవ పడిన భార్య పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం వడ్డీ గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలివి.. భార్యభర్తల మధ్య జరిగిన గొడవ వారి పిల్లల ప్రాణాలకు మీదకు వచ్చింది. ప్రమీల అనే వివాహితకు సాయిచరణ్(8), అజయ్ కుమార్(7), పార్థు(5) అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. తీవ్ర మనస్థాపంతో ఆమె ముగ్గురికి పురుగుల మందు తాగించి తాను కూడా తాగింది.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారిని కూనవరం ఆస్పత్రికి తరలించారు. ప్రమీల పరిస్థితి విషమంగా ఉండటంలో మెరుగైన వైద్యం కోసం భద్రాచలంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.