
సాక్షి, గుంటూరు : ఓ తల్లి తన ఇద్దరి పిల్లలతో సహా ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన మంగళగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలివి.. దుర్గాభవాని అనే మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దుర్గభవాని, మూడేళ్ల కూతురు హేమశ్రీ మృతి చెందారు. మరో కూతురు సాయిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.