మాజీ భర్తను దక్కించుకోవాలని సవతిపై అఘాయిత్యం | Woman Masterminds Molestation On Ex Husband Wife In Haryana | Sakshi
Sakshi News home page

Sep 21 2018 7:49 PM | Updated on Sep 21 2018 9:05 PM

Woman Masterminds Molestation On Ex Husband Wife In Haryana - Sakshi

మరో పెళ్లి చేసుకున్న మాజీ భర్తపై అక్కసుతో సవతిపై సామూహిక అత్యాచారం చేయించింది.

చండీగఢ్‌ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను మరో మహిళ చిత్రహింసలకు గురి చేసింది. అంబాలాలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత డిసెంబర్‌లో భర్త నుంచి విడాకులు తీసుకున్న నిందితురాలు.. అతడిపై పగ సాధించాలనుకుంది. ఇటీవల తన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో అతడి కాపురాన్ని కూల్చాలని తన కుంటుంబంతో కలిసి పథకం పన్నింది.

కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడి ఇంటిపై దాడి చేసిన సదరు మహిళ.. భార్యభర్తలను కిడ్నాప్‌ చేసి.. రెండు వేర్వేరు వాహనాల్లో వారిని పానిపట్‌కు తరలించారు. తన మాజీ భర్తకు విడాకులు ఇవ్వాలని బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె అంగీకరించక పోవడంతో తీవ్రంగా కొట్టడమే కాకుండా.. ఆమెపై సామూహిక అత్యాచారానికి ఉసిగొల్పింది. దాదాపు పదకొండున్నర గంటలు చిత్రహింసలు పెట్టిన అనంతరం గురువారం ఉదయం బహదుర్‌ఘర్‌లో బాధితులను విడిచిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకృత్యానికి పాల్పడిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని గురుగ్రామ్‌లో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement