ఎఫ్‌బీలో యువతి ఫొటో పెట్టారని... | Woman Photo Upload In Facebook Father And Daughter Suicide | Sakshi
Sakshi News home page

ఎఫ్‌బీలో యువతి ఫొటో పెట్టారని...

Mar 26 2018 10:51 AM | Updated on Nov 6 2018 8:16 PM

Woman Photo Upload In Facebook Father And Daughter Suicide  - Sakshi

రాయచూరు రూరల్‌: సామాజిక మాధ్యమాల్లో యువతి ఫొటోను అప్‌లోడ్‌ చేసినందుకు ప్రశ్నించిన బాధితురాలి తండ్రిపై యువకులు దాడి చేశారు. దీన్ని అవమానంగా భావించిన తండ్రీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటక సింధనూరు తాలూకా గౌడన బావిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామనగౌడ కుమార్తె బసలింగమ్మ(20) సింధనూరులో పీయూసీ ద్వితీయ సంవత్సరం  చదువుతోంది. రోజూ సింధనూరుకు వచ్చి వెళ్తుండేది.

ఈక్రమంలో వారం రోజుల క్రితం గ్రామంలోని కొందరుయువకులు ఆ విద్యార్థిని ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు.  దీనిపై ఆదివారం రోజు యువతి తండ్రి సదరు యువకులను ప్రశ్నించారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఓ దశలో యువకులు రామనగౌడపై దాడి చేశారు. ఈ ఘటనను అవమానంగా భావించిన రామనగౌడ, బసలింగమ్మలు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బళగనూరు పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement