విజయవాడలో మహిళ దారుణ హత్య | Women Brutally Murder In Vijayawada | Sakshi
Sakshi News home page

మహిళ గొంతుకోసిన దుండుగులు

Published Fri, Jan 31 2020 9:21 PM | Last Updated on Fri, Jan 31 2020 9:43 PM

Women Brutally Murder In Vijayawada - Sakshi

సాక్షి, కృష్ణా : విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. నగల కోసం ఓ మహిళ హత్యను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భవానిపురం పాండు హోటల్ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దాడి చేసి ఒంటిపై ఉన్న బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి దారుణంగా హతమార్చారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్ టీం వివరాలను సేకరిస్తోంది. ఆ ప్రాంత సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులు భయభ్రాంతులకు గురిచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement