
శరణ్ (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: దీపావళి రోజున విశాఖ నగరంలో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. మధురవాడ ప్రాంతంలోని వెంకటేశ్వర నగర్‌కు చెందిన సత్యాల శరణ్ (24) డెయిరీ ఫారమ్ జంక్షన్ సమీపంలో ఓయో హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం వెంకోజీపాలెంలో ఉన్న తన స్నేహితుడిని తీసుకు రావడానికి బైక్‌పై బయలుదేరాడు.
మితిమీరిన వేగంతో వచ్చిన లారీ డెయిరీ ఫారం వద్ద వెనుక నుంచి శేఖర్ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌తో పాటు శేఖర్‌ను మద్దిలపాలెం జంక్షన్ వరకు మూడు కిలోమీటర్లు మేర ఈడ్చుకుపోయింది. ఇదిచూసిన స్థానికులు కేకలు వేయడంతో లారీ రోడ్డు పక్కన నిలిపాడు. ఈ ఘటనలో శరణ్ శరీరం నుంచి కాలు, చేతులు విడిపోయాయి. ఆరిలోవ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.