వాషింగ్టన్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను అమెరికాలోని ఎన్ఆర్ఐ విద్యార్థులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అయోవా రాష్ట్రం డెస్ మోయినెస్ నగరంలో ఎన్ఆర్ఐ విద్యార్థులు కేసీఆర్ 63వ జన్మదినోత్సవాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, సుదీర్ఘకాలం సంతోషంగా జీవితం గడపాలని ఎన్ఆర్ఐ విద్యార్ధులు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో నవతేజ, ప్రదీప్ చంద్ర, రవి, సంతోష్, రాధాక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అమెరికాలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
Published Sat, Feb 18 2017 2:48 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
Advertisement
Advertisement