డలాస్ తెలంగాణ ప్రజా సమితి(టీపీఏడీ) 2017 బతుకమ్మ-దసరా సంబరాలను సెప్టెంబరు 30వ తేదీన చేయనున్నట్లు తెలిపింది.
డాలస్: డాలస్ తెలంగాణ ప్రజా సమితి(టీపీఏడీ), 2017 బతుకమ్మ-దసరా సంబరాలను సెప్టెంబరు 30వ తేదీన చేయనున్నట్లు తెలిపింది. ప్రతి సంవత్సరం డాలస్ తెలంగాణ ప్రజా సమితి బతుకమ్మ, దసరా సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి డాలస్ ఫోర్ట్ వర్త్(డిఎఫ్‌డబ్ల్యూ) కమ్యూనిటీ నాయకులు, వ్యాపారస్తులు, వివిధ ఆర్గనైజేషన్స్‌కు చెందిన ప్రతినిధులు హాజరవనున్నారు.
సెప్టెంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని టీపీఏడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పది వేల మంది హజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రోగ్రామ్‌కు వచ్చిన అతిధులకు, కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
టాండెడ్ డలాస్ ఫోర్ట్ వర్త్ తెలుగు సంఘం, సంస్థలు, సభ్యులు మరియు శ్రేయోభిలాషులు దాదాపుగా 300 మంది విందుకు హజరవుతారని తెలిపారు. కార్యక్రమం గాయకుల బృందం ప్రేయర్ సాంగ్‌తో ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఆటపాటలతో వచ్చిన అతిథులను, కుటుంబాలను ఎంటర్‌టైన్ చేస్తారని చెప్పారు. కమ్యూనిటీ నాయకుడు, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ కొసపాటి, టాన్‌టెక్స్ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, డాక్టర్ నరసింహ రెడ్డి ఉరిమిండి, శ్రీకాంత్ పొలవరపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.
టీపీఏడీ అధ్యక్షుడు కరణ్ రెడ్డి సమావేశానికి హజరైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ టీపీఏడీ, సెక్రటరీ రమణ లష్కర్, జాయింట్ సెక్రటరీ చంద్ర పోలీసు, ట్రెజరర్ లింగా రెడ్డి అల్వ, శ్రీని గంగాధార, సత్య పేర్ కరి, శరత్ ఎర్రం, రూప కన్నయ్యగారి, రోజా అదెపు, టీపీఏడీ కో- ఆర్డినేటర్ సతీష్ జన్ముపల్లి, మాధవి సుంకి రెడ్డి, బతుకమ్మ కమిటీలను, వివిధ కమిటీల చైర్మన్‌లను పరిచయం చేస్తారని చెప్పారు. చైర్మన్ అశోక్ కొండల మాట్లాడుతూ.. ధర్మకర్తలైనా వైస్-చైర్మన్ మనోహర్ కసగాని, కో-ఆర్డినేటర్ మాధవి సుంకిరెడ్డి, రామ్ ఆన్నాడి, పవన్ గంగాధార, ఇందు పంచర్‌పుల, ప్రవీణ్ బిల్లా, రాజేందర్ తొడిగలను పరిచయం చేస్తారు.
తెలుగు ఫౌండేషన్ కమిటీ సభ్యులైన మహేంద్ర కమిరెడ్డి(వైస్ చైర్మెన్), అజయ్ రెడ్డి, రఘుబీర్ బండారు, రావ్ కాల్వలా, జానకి మందడి, రాజ్ గొందీలను ఫౌండేషన్ కమిటీ చైర్మన్ ఉపేంద్ర పరిచయం చేశారు. తెలంగాణ ప్రజా సమితి, డాలస్ సలహాదారులైనా వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగమ్, సంతోష్ కొరె, నరేశ్ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, మాధవి లోకిరెడ్డి, సతీశ్ నగిలా, గంగా దేవర, అరవింద్ రెడ్డి ముప్పిడిలను రామ్ కల్వాల పరిచయం చేస్తారు. టీపీఏడీ 2017 బతుకమ్మ- దసరా సంబరాల బ్రౌచర్స్ ను టీపీఏడీ బోర్డ్ సభ్యులు, శారద సింగిరెడ్డి, ఆత్మచరణ్ రెడ్డిలు కలిసి ఆవిష్కరించారు.
సహకార సంఘం అఖిల్ చీదిరాల సభ్యులైనా సునీల్ కుమార్ ఆకుల, లక్ష్మి పొరెడ్డి, కల్యాణి తడిమెటి, మధుమతి వైషారాజు, కారుణ్య దామర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్న ఉప్పల, రోహిత్ నరిమెటి, శంకర్ పరిమాల్, మాధవి ఓంకార్, అనూష వనం, దీప్తి సూర్యదేవర, అపర్ణ సింగిరెడ్డి, కమేశ్వరి దివకర్ల, కవిత బ్రహ్మదేవరలను మనోహర్ కసగని పరిచయం చేస్తారు. అజయ్ రెడ్డి రఘుబీర్ భంగారు, మనోహర్ కసగని, ఉపేంద్ర తెలుగు అశోక్ కొండల, రామ్ అన్నాడి తరఫున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు ముందుకొచ్చారు.
2,45 లక్షల అమెరికన్ డాలర్లు ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఆట, నోటా, టాటా, తానా, నాట్స్, ఆట(తెలంగాణ), స్ధానిక సంస్థలు టాన్‌టెక్స్, ఐఎఎన్‌టి, టీఈఏ, మనబడి వంటి సంస్ధలు బతుకమ్మ-దసరా సంబరాలు 2017కు తమ మద్దతు ప్రకటించాయి. బతుకమ్మ సంబరాలకు మద్దతు తెలిపిన సంస్థలకు టీపీఏడీ పౌండేషన్, బీఓటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ 2017 సంబరాలు ఎప్పటికి గుర్తిండిపోయేలా నిర్వహిస్తామని పేర్కొన్నాయి. బతుకమ్మ-దసరా సంబరాలు సెప్టెంబర్ 30వ తేది(శనివారం) టెక్సాస్‌లోని డా.పెప్పర్ అరేనా ఫ్రిస్కోలో జరగనున్నాయి.