హిందూపురం రూరల్ : మండలంలోని కొటిపి గ్రామం కెంచనపల్లి వద్ద పొలంలో విద్యుదాఘాతానికి గురై 12 గొర్రెలు మంగళవారం మత్యువాత పడ్డాయి. నాలుగు రోజుల క్రితం త్రీ ఫేజ్ విద్యుత్ తీగలు కిందకు పడ్డాయి. అవి ఆరోజు నుంచి తొలగించలేదు. ఆ తీగలు గొర్రెలకు తగిలి మతి చెందాయని గొర్రెల కాపరులు చలపతి, గంగాధరప్ప, శ్రీనివాసులు జెవీ వెంకటస్వామి తెలిపారు. సుమారు రూ.లక్ష ఆర్థికనష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.