ఏలూరు : విశాఖపట్నం నుంచి ముంబై అక్రమంగా తరలిస్తున్న 165 కిలోల గంజాయిని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులోని ఐదు బస్తాల గంజాయిని గుర్తించారు.
గంజాయితోపాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన కోసూరి సతీష్‌కుమార్, పుష్పాల శ్రీనివాసనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్‌లో రూ.15 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు.